APSACS Krishna Jobs: టెన్త్‌/డిప్లొమా అర్హతతో కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.72 వేల జీతం.. | APSACS Krishna District Recruitment 2022 for 23 ICTC Lab Technician, ART Medical Officer other posts through DSC - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 28 August 2022

APSACS Krishna Jobs: టెన్త్‌/డిప్లొమా అర్హతతో కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.72 వేల జీతం.. | APSACS Krishna District Recruitment 2022 for 23 ICTC Lab Technician, ART Medical Officer other posts through DSC

ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పరిధిలోని కృష్ణా జిల్లాలో (APSACS Krishna District)..  ఒప్పంద ప్రాతిపదికన..

APSACS YSR Krishna Medical Officer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పరిధిలోని కృష్ణా జిల్లాలో (APSACS Krishna District)..  ఒప్పంద ప్రాతిపదికన 23 ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్, ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్, ఏఆర్‌టీ కౌన్సెలర్, ఏఆర్‌టీ స్టాఫ్ నర్స్, ఏఆర్‌టీ ఫార్మాసిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ మచిలీపట్నంలోని కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నియంత్రణ కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి పదోతరగతి, సంబంధిత స్పెషలైజేషన్లలో డిప్లొమా/డిగ్రీ/ఎంబీబీఎస్‌/బీఎస్సీ నర్సింగ్/పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 42 నుంచి 65 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు సెప్టెంబర్‌ 2, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు:

  • ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 2
  • ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 4
  • ఏఆర్‌టీ కౌన్సెలర్ పోస్టులు: 3
  • ఏఆర్‌టీ స్టాఫ్ నర్స్‌ పోస్టులు: 5
  • ఏఆర్‌టీ ఫార్మాసిస్ట్ పోస్టులు: 1
  • ఏఆర్‌టీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 1
  • ఏఆర్‌టీ కమ్యూనిటీ కేర్ కోఆర్డినేటర్ పోస్టులు: 1
  • ఎల్‌ఏసీ ప్లస్ స్టాఫ్ నర్స్‌ పోస్టులు: 2
  • బ్లడ్ సెంటర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 3
  • బ్లడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాన్ అటెండెంట్ పోస్టులు: 1

అడ్రస్‌: The Office of the District TB Control Office, near main railway station, Malkapatnam, Machilipatnam.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages