AP Govt Jobs 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 351 స్పెషలిస్టు డాక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్షలేకుండానే ఎంపిక.. | AP govt Recruitment 2022 for 351 Specialist doctor Posts, check full details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday 15 August 2022

AP Govt Jobs 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 351 స్పెషలిస్టు డాక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్షలేకుండానే ఎంపిక.. | AP govt Recruitment 2022 for 351 Specialist doctor Posts, check full details

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. 351 స్పెషలిస్టు డాక్టర్‌ (Specialist Doctor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

AP HMFW CAS Specialists Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. 351 స్పెషలిస్టు డాక్టర్‌ (Specialist Doctor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం.. గైనకాలజీ విభాగంలో 60 పోస్టులు, ఎనస్థీషియా-60 పోస్టులు, పిడియాట్రిక్స్‌-51 పోస్టులు, జనరల్‌ మెడిసిన్‌- 75 పోస్టులు, జనరల్‌ సర్జరీ -57 పోస్టులు, రేడియాలజీ -27 పోస్టులు, పతాలజీ-9 పోస్టులు, ఈఎన్‌టీ-9 పోస్టులు, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ ప్రకటన విడుదల చేశారు. పీజీ/డిప్లొమా/డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 42 యేళ్లకు మించకుండా ఉండాలి. అకడమిక్‌ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించినవారికి నెలకు రూ.61,960ల నుంచి రూ.1,51,370ల వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తు రుసుముగా జనరల్ అభ్యర్ధులు రూ.500లు తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 26, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చూడొచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages