AIIMS Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక.. ఎయిమ్స్ నాగ్‌పూర్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షలకుపైగా జీతం.. | AIIMS Nagpur Recruitment 2022 for 29 Professor Posts, check details jobs in telugu - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday 14 August 2022

AIIMS Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక.. ఎయిమ్స్ నాగ్‌పూర్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షలకుపైగా జీతం.. | AIIMS Nagpur Recruitment 2022 for 29 Professor Posts, check details jobs in telugu

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన మహారాష్ట్రలోనున్న నాగ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Nagpur).. 29 టీచింగ్‌ పోస్టుల (Professor Posts) భర్తీకి..

AIIMS Nagpur Professor Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన మహారాష్ట్రలోనున్న నాగ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Nagpur).. 29 టీచింగ్‌ పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం, గ్యాస్ట్రోఎంటరాలజీ (మెడికల్), నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పల్మనరీ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ అంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అండ్‌ బ్లడ్ బ్యాంక్, ట్రామా అండ్‌ ఎమర్జెన్సీ, యూరాలజీ తదితర స్పెషలైజేషన్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎంబీబీఎస్‌, సంబంధిత సబ్జెక్టులో ఎండీ/ఎంఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలేజేషన్లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. వయసు 58 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి చేసిన అప్లికేషన్‌ను ప్రింట్‌ఔట్‌ తీసుకుని కింది అడ్రస్‌కు సెప్టెంబర్‌ 26, 2022వ తేదీలోపు పోస్టుల ద్వారా పంపించాలి. అప్లికేషన్‌ ఫీజు జనరల్ అభ్యర్ధులకు రూ. 1000, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.500లు చెల్లించాలి. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.1,01,500ల నుంచి రూ.2,20,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు:

  • ప్రొఫెసర్ పోస్టులు: 8
  • అడిషనల్‌ ప్రొఫెసర్ పోస్టులు: 9
  • అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 5
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 7

అడ్రస్: The Director, AIIMS Nagpur, Administrative Block, Plot no.2, Sector -20, MIHAN, Nagpur – 441108.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages