‘5G’ Technology: 2025 నాటికి 5జీ టెక్నాలజీతో రెండు కోట్ల కొత్త ఉద్యోగాలు | More than 2 crore jobs by 2025 with ‘5G’ technology - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 22 August 2022

‘5G’ Technology: 2025 నాటికి 5జీ టెక్నాలజీతో రెండు కోట్ల కొత్త ఉద్యోగాలు | More than 2 crore jobs by 2025 with ‘5G’ technology

భారత్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ‘5జీ’ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. టెలికాం రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తోన్న ‘5జీ’ టెక్నాలజీతో 2025 నాటికి దేశంలో 2 కోట్లకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకొచ్చే అవకాశం ఉన్నట్లు ‘టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌’ (TSSC) అంచనా..

5G services to be affordable in India: భారత్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ‘5జీ’ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. టెలికాం రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తోన్న ‘5జీ’ టెక్నాలజీతో 2025 నాటికి దేశంలో 2 కోట్లకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకొచ్చే అవకాశం ఉన్నట్లు ‘టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌’ (TSSC) అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, బిగ్‌డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీల ఆధారంగా సేవలు అందిస్తున్న సంస్థలు నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం వెతుకులాట ప్రారంభించింది. ఐటీ హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌లో ఎమర్జింగ్‌ టెక్నా లజీ ఆధారిత ఉద్యోగాల కల్పన తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే రెండు, మూడేళ్లలో సుమారు లక్ష మందికి 5జీ సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోని పరిశ్రల యాజమన్యాలతో ‘టెలికాం మంథన్‌ 2022’ పేరిట ఇటీవల చర్చలు జరిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న నైపుణ్య శిక్షణకు ప్రముఖ నైపుణ్యాభివృద్ధి సంస్థ టీఎస్‌ఎస్‌సీ హైదరాబాద్‌లో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ఏర్పాటుకు చేసేందుకు ‘టాస్క్‌’తో రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో టీఎస్‌ఎస్‌సీ ఏర్పాటు చేసే సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ 5జీతో పాటు ఇతర ఎమర్జింగ్‌ టెక్నాలజీల నైపుణ్య శిక్షణపై కూడా దృష్టి కేంద్రీకరించనుంది.

శిక్షణ ఇవ్వడం, అనంతరం సర్టిఫికెట్ల జారీ టీఎస్‌ఎస్‌సీ ద్వారా జరుగుతుంది. యువత ఎక్కువ సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నందువల్ల హైదరాబాద్‌లో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు టీఎస్‌ఎస్‌సీ వెల్లడించింది. హైదరాబాద్‌ ఏర్పాటు చేయనున్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ 5జీ సాంకేతికతతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తేవడంలో క్రియాశీల పాత్ర పోషించనుంది. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్లలో ఉపయోగిస్తున్న 4జీ టెక్నాలజీ కంటే కొత్తగా వస్తున్న 5జీ టెక్నాలజీ వంద రెట్లు వేగంగా పనిచేస్తుంది. అందువల్ల కొత్తగా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల్లో నైపుణ్య శిక్షణ కీలకంగా మారనుంది. దీంతో ఇప్పటికే పలు సంస్థలు 5జీ టెక్నాలజీతో ఇతర ఎమర్జింగ్‌ టెక్నాలజీలపై తమ ఉద్యోగులకు శిక్షణనిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages