TS Police Recruitment 2022: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ రాత పరీక్షా తేదీలు ఖరారు..! | Police recruitment 2022 exam dates for si and constable posts confirmed - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday 4 July 2022

TS Police Recruitment 2022: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ రాత పరీక్షా తేదీలు ఖరారు..! | Police recruitment 2022 exam dates for si and constable posts confirmed

TS Police Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే. అయితే కానిస్టేబుల్‌ అభ్యర్థులకు పోలీసు ..

TS Police Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే. అయితే కానిస్టేబుల్‌ అభ్యర్థులకు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలక సమాచారం అందించింది. పోలీసు పరీక్షా తేదీలను అధికారికంగా ప్రకటించింది బోర్డు. ఈ పరీక్షలను రెండు దఫాలుగా నిర్వహిస్తున్నట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. ఆగస్టు 7, 21వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆగస్టు 7న ఎస్సై రాత పరీక్షా, 21న కానిస్టేబుల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ప్రిలిమ్స్‌ హాల్‌ టికెట్లు www.tslprb.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జులై 30 నుంచి ఎస్సై, ఆగస్టు 10 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చునని కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.

తెలంగాణ సర్కార్‌ మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 17,291 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఏప్రిల్‌ 28వ తేదీన నోటిఫికేషన్లను జారీ చేసింది. ఆయా నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 17,291 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో 554 ఎస్‌ఐ పోస్టులు, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులు, 614 ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎస్సై పోస్టులకు 2.45లక్షల మంది, కానిస్టేబుల్‌ పోస్టులకు 6.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages