తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఈ రోజు (జులై 26) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫకేషన్ ప్రకారం కాపీయిస్ట్, టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది..
Telangana High Court Typist and Copyist Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఈ రోజు (జులై 26) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫకేషన్ ప్రకారం కాపీయిస్ట్, టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 85 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతి ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.24,280 నుంచి రూ.72,850ల వరకు జీతం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 25 (రాత్రి 11 గంటల 55 నిముషాల) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, టైప్ రైటింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు హాల్ టికెట్లు సెప్టెంబర్ 5 నుంచి విడుదలవుతాయి. పరీక్ష సెప్టెంబర్ 25న జరుగుతుంది.
ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా.. ఏదైనా విభాగాల్లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా జులై 1, 2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుముగా జనరల్ అభ్యర్ధులు రూ.800, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.400లు చెల్లించవల్సి ఉంటుంది. ఇతర ముఖ్య సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ http://tshc.gov.inను చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
No comments:
Post a Comment