Top institutes: మరోసారి సత్తా చాటిన ఐఐటీ మద్రాస్‌.. ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులు ప్రకటించిన కేంద్రం..  | NIRF Rankings Central education minister released list of top educational institutes of india - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 15 July 2022

Top institutes: మరోసారి సత్తా చాటిన ఐఐటీ మద్రాస్‌.. ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులు ప్రకటించిన కేంద్రం..  | NIRF Rankings Central education minister released list of top educational institutes of india

India Top institutes: ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర ప్రధాన్‌ శుక్రవారం విడుదల చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF)లో మొత్తం 7,254 ఉన్న విద్యా సంస్థలు పాల్గొనగా…

India Top institutes: ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర ప్రధాన్‌ శుక్రవారం విడుదల చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF)లో మొత్తం 7,254 ఉన్న విద్యా సంస్థలు పాల్గొనగా ఐఐటీ మద్రాస్‌ ఓవరాల్‌ కేటగిరీల్లో మొదటి ర్యాంక్‌ సాధించి అత్యుత్తమ విద్యా సంస్థగా నిలిచింది. గతంలోనూ ఐఐటీ మద్రాస్‌ ఈ ఘనతను సాధించగా తాజాగా ఆ స్థానాన్ని కొనసాగించింది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, మెడికల్, డెంటల్, రీసెర్చ్, కళాశాల విభాగాల్లో ర్యాంకులను విడుదల చేశారు. విద్యాబోధన, నేర్చుకోవడం, వనరులు, పరిశోధన సహా అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ ర్యాంకులను జారీ చేశారు.

ఐఐటీ మద్రాస్‌ మద్రాస్‌ మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో ఐఐఎస్సీ బెంగళూరు, మూడో స్థానంలో ఐఐటీ బాంబే చోటు దక్కించుకున్నాయి. యూనివర్సిటీ కేటగిరీలో మొదటిస్థానంలో ఐఐఎస్సీ బెంగళూరు, రెండోస్థానంలో జేఎన్యూ-న్యూఢిల్లీ, మూడోస్థానంలో జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ నిలిచాయి. ఇక ఇంజనీరింగ్ కేటగిరీ విషయానికొస్తే మొదటిస్థానంలో ఐఐటీ మద్రాస్, రెండోస్థానంలో ఐఐటీ ఢిల్లీ, మూడోస్థానంలో ఐఐటీ బాంబే ఉన్నాయి. మేనేజ్‌మెంట్ విభాగంలో మొదటిస్థానంలో ఐఐఎం అహ్మదాబాద్, రెండోస్థానంలో ఐఐఎం బెంగళూరు, మూడోస్థానంలో ఐఐఎం కోల్‌కతా నిలిచాయి.

ఫార్మసీ కేటగిరీలో న్యూఢిల్లీలోని జామియా మొదటి స్థానంలో నలివగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్, రెండోస్థానంలో.. పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్  మూడోస్థానంలో  ఉన్నాయి. టాప్ 3 కాలేజీల కేటగిరీలో మొదటిస్థానంలో మిరిండా కాలేజి, న్యూఢిల్లీ, రెండో స్థానంలో హిందూ కాలేజి, న్యూఢిల్లీ, మూడోస్థానంలో ప్రెసిడెన్సీ కాలేజి, చెన్నై నిలిచాయి. ఆర్కిటెక్చర్ విభాగంలో మొదటిస్థానంలో ఐఐటీ రూర్కీ, రెండోస్థానంలో ఎన్ఐటీ కాలికట్, మూడోస్థానంలో ఐఐటీ, ఖరగ్‌పూర్ కొనసాగుతున్నాయి. లా విభాగంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా, బెంగళూరు మొదటిస్థానంలో ఉండగా.. రెండోస్థానంలో నేషనల్ లా యూనివర్సిటీ న్యూఢిల్లీ, మూడోస్థానంలో సింబియాసిస్ లా స్కూల్, పూణేలు ఉన్నాయి.

మెడికల్ కేటగిరీ విషయానికొస్తే న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ మొదటి స్థానంలో నిలవగా.. రెండోస్థానంలో పీజీఐఎంఐ, చండీగఢ్, మూడోస్థానంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజి, వేలూర్ (తమిళనాడు) ఉన్నాయి. డెంటల్ కేటగిరీలో సవితా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్ – చెన్నై, రెండోస్థానంలో మణిపాల్ కాలేజి ఆఫ్ డెంటల్ సైన్సెస్ – మణిపాల్, మూడోస్థానంలో డా. డీవైపాటిల్ విద్యాపీఠ్, పూణేలు ఉన్నాయి. రీసెర్చ్ కేటగిరీలో మొదటిస్థానంలో ఐఐఎస్సీ బెంగళూరు, రెండోస్థానంలో ఐఐటీ మద్రాస్, మూడోస్థానంలో ఐఐటీ ఢిల్లీ నిలిచాయి.

ఇవి కూడా చదవండి



మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages