Telangana Inter Board: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పరీక్ష ఫీజు గడువు పెంపు | Good news for Telangana Inter students.. Extension of exam fee deadline - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 16 July 2022

Telangana Inter Board: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పరీక్ష ఫీజు గడువు పెంపు | Good news for Telangana Inter students.. Extension of exam fee deadline

Telangana Inter Board: తెలంగాణ ఇంటర్మీయేడిట్‌ ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఫెయిల్‌ ఆయిన విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది విద్యాశాఖ. గత వారం రోజుల..

Telangana Inter Board: తెలంగాణ ఇంటర్మీయేడిట్‌ ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఫెయిల్‌ ఆయిన విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది విద్యాశాఖ. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా జూలై 17వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్మీడియేట్‌ అడ్వాన్స్‌ పరీక్షలు, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు జూలై 8తో ముగిసింది. అయితే వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఫీజులు చెల్లించడంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాంటి విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త అందించింది. ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో రెండు రోజుల అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇంటర్మీడియేట్‌ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు, ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఈనెల 18,19 తేదీల్లో రూ.200 ఫైన్‌తో ఫీజు చెల్లించుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు.

అ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫీజు చెల్లించిన విద్యార్థులు ప్రాక్టికల్‌ పరీక్షలో తప్పినవారికి జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూమ్‌ పరీక్ష జూలై 22న, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జూలై 23న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది. ఆగస్టు 1 నుంచి 10వరకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియేట్‌ బోర్డు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages