Kerala NEET: చల్లారని కేరళ నీట్ వివాదం.. అమ్మాయిల లోదుస్తులు విప్పించిన మరో ఇద్దరు టీచర్ల అరెస్ట్ | Two more teachers arrested in Kerala NEET controversy - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 21 July 2022

Kerala NEET: చల్లారని కేరళ నీట్ వివాదం.. అమ్మాయిల లోదుస్తులు విప్పించిన మరో ఇద్దరు టీచర్ల అరెస్ట్ | Two more teachers arrested in Kerala NEET controversy

కేరళ నీట్ పరీక్షల సందర్భంగా విద్యార్థులను వేధింపులకు గురిచేసిన వివాదంలో మరో ఇద్దరు ఉపాధ్యాయులను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Kerala NEET Controversy: కేరళలో నీట్ పరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న అమానుష ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కేరళ నీట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన బాలికల లోదుస్తులు విప్పించిన ఘటనలో తాజాగా.. మరో ఇద్దరు టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ వివాదంలో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య ఏడుకు చేరింది. కేరళ నీట్ పరీక్షల సందర్భంగా విద్యార్థులను వేధింపులకు గురిచేసిన వివాదంలో మరో ఇద్దరు ఉపాధ్యాయులను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కస్టడీలో ఉన్న మొత్తం అనుమానితుల సంఖ్య ఏడుకు చేరుకుంది. పోలీసులు, ప్రొఫెసర్ ప్రిజీ కురియన్, డాక్టర్ షమ్నాద్ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన ఇద్దరు వివాదాస్పద తనిఖీలు చేపట్టాలని కళాశాలలోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

అంతకుముందు.. జూలై 17న కేరళలోని కొల్లాంలో జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి హాజరయ్యే ముందు విద్యార్థులను ఇన్నర్‌వేర్ తొలగించమని విద్యార్థులను బలవంతం చేసినందుకు ఇద్దరు కళాశాల సిబ్బందితో సహా ఐదుగురిని మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ముగ్గురు ఏన్టీఏ ఏజెన్సీకి చెందినవారున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

కాగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యుజి) పరీక్షను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు కేంద్రాన్ని కోరారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages