సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి టర్మ్ 2 పరీక్షల ఫలితాలు ఈ రోజు (జులై 20) విడుదలకానున్నాయి. సీబీఎస్సీ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు..
CBSE Class 10th Term 2 Result 2022 updates: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి టర్మ్ 2 పరీక్షల ఫలితాలు ఈ రోజు (జులై 20) విడుదలకానున్నాయి. సీబీఎస్సీ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. టర్మ్ 2 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in లేదా cbseresults.nic.in లేదా digilocker.gov.in లేదా parikshasangam.cbse.gov.inలో చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధుల ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా సీబీఎస్సీ 10వ తరగతి, 12 వ తరగతి టర్మ్ 2 ఫలితాల కోసం విద్యార్ధులు ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ రోజు 10వ తరగతి ఫలితాలు విడుదలకానున్నాయి. త్వరలో 12వ తరగతి ఫలితాలు కూడా ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి సీబీఎస్సీ 10వ తరగతి టర్మ్ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు దేశ వ్యాప్తంగా 75 సబ్జెక్టులకు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 21,16,209ల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ప్రాక్టికల్స్, థియరీలతో కలిపి 33 శాతం, ఆపైన మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా బోర్డు ప్రకటించనుంది. సీబీఎస్సీ 12వ తరగతి టర్మ్ 2 పరీక్షలకు దాదాపు 3,50,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. జులై చివరి నాటికి అధికారులు ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన తేదీ ఏదీ సీబీఎస్సీ బోర్డు అధికారికంగా తెలుపలేదు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
No comments:
Post a Comment