CBSE 10th Results: CBSE 10వ తరగతి ఫలితాలు రిలీజ్.. బాలురి కంటే బాలికలే అధిక శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే | CBSE 10th class Results 2022 declared; here’s how to check full details here - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday 22 July 2022

CBSE 10th Results: CBSE 10వ తరగతి ఫలితాలు రిలీజ్.. బాలురి కంటే బాలికలే అధిక శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే | CBSE 10th class Results 2022 declared; here’s how to check full details here

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు శుక్రవారం 10వ తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది కూడా బాలికలు బాలురిపై పై చేయి సాధించారు. బాలురుకంటే 1.41% శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణులయ్యారు.

CBSE 10th Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి పరీక్షా ఫలితాలను సీబీఎస్సి బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది 94.40% మంది విద్యార్థులు బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత 1.41% తో అబ్బాయిల కంటే అధికంగా పాస్ అయ్యి రికార్డ్ సృష్టించారు. 10వ తరగతి పరీక్షల్లో బాలికలు 95.21 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 93.80 శాతం ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 90 శాతం సాధించారు. CBSE 10వ తరగతి ఫలితాలు 2022 ఫలితాలు results.cbse.nic.in  లేదా cbse.gov.inలలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.

CBSE బోర్డ్ 10వ ఫలితాలు cbseresults.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. CBSE బోర్డు ఇప్పటికే తన అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in , results.cbse.nic.in లో 12వ తరగతి విద్యార్థులకు టర్మ్ 2  ఫలితాలను ప్రకటించింది. CBSE 10, 12వ తరగతి ఫలితాలను ఒకే రోజున ప్రకటించడం ఇదే మొదటిసారి. విద్యార్థులు తమ బోర్డు పరీక్ష రోల్ నంబర్, పుట్టిన తేదీ , పాఠశాల కోడ్‌ ద్వారా ఈ వెబ్‌సైట్‌ల నుండి తమ స్కోర్‌కార్డ్‌లను  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్ & ఉద్యోగాలు  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages