భారత ప్రభుత్వానికి చెందిన ముంబయిలోని సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (CBHFL).. 45 ఆఫీసర్ గ్రేడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
CBHFL officer Recruitment 2022: నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు చెందిన ముంబయిలోని సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (CBHFL).. 45 ఆఫీసర్ గ్రేడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటిల్లో ఆఫీసర్ పోస్టులు-22, సీనియర్ ఆఫీసర్ పోస్టులు 16, జూనియర్ మేనేజర్ పోస్టులు 7 వరకు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జులై 30, 2022 నుంచి ఆగస్టు 18 వరకు కొనసాగుతుంది. ఈ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఆన్‌లైన్ విధానంలో జరిగే రాత పరీక్ష 2022 సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. అర్హతలు, వయోపరిమితి, జీతభత్యాలు, రాత పరీక్ష విధానం, సిలబస్ వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలయ్యాక తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.cbhfl.com. ను చెక్ చేసుకోవాలి.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
No comments:
Post a Comment