TS SSC Results 2022: రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. రిజల్డ్‌ కోసం ఇలా చెక్‌ చేసుకోండి.. | TS SSC Results 2022 Date: Telangana Board 10th result releasing on June 30 - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 29 June 2022

TS SSC Results 2022: రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. రిజల్డ్‌ కోసం ఇలా చెక్‌ చేసుకోండి.. | TS SSC Results 2022 Date: Telangana Board 10th result releasing on June 30

TS SSC Results 2022: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాలు విడుదల చేసేందుకు..

TS SSC Results 2022: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఈ పదో తరగతి ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 23 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు పదో తరగతి పరీక్షలు కొనసాగాయి. నిన్న ఇంటర్మీడియేట్‌ ఫలితాలు విడుదల కాగా, టెన్త్‌ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.

ఈ సంవత్సరం టెన్త్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది హాజరయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లను మాత్రమే నిర్వహించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ పెంచారు. రెండేళ్ల తర్వాత ఈ జరిగిన పదోతరగతి పరీక్షలు జరగడంతో.. వీటి ఫలితాల విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ tv9 websiteతో పాటు www.bse.telangana.gov.in లేదా www.bseresults.telangana.gov.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages