TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాల తేదీ వచ్చేసింది.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే.. | Telangana inter 1st year and 2nd results released on june 28th - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 June 2022

TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాల తేదీ వచ్చేసింది.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే.. | Telangana inter 1st year and 2nd results released on june 28th

TS Inter Results: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే పలు కారణాల వల్ల ఫలితాల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎట్టకేలకు…

TS Inter Results: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే పలు కారణాల వల్ల ఫలితాల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎట్టకేలకు ఫలితాల తేదీని అధికారికంగా ప్రకటించారు. మంగళవారం (జూన్‌ 28)న ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ ఫలితాలను విడుదల చేయనున్నాట్లు అధికారికంగా ప్రకటించారు. జూన్‌ 28న ఉదయం 11 గంటలకి ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తెలంగాణలో మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్మీడియర్ పరీక్షలు రాయగా.. వీరిలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఫలితాల తేదీలు పలుసార్లు వాయిదా పడుతుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా మంగళవారం ఫలితాలు వచ్చేస్తున్నాయన్న వార్తతో విద్యార్థుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయ్యింది.

Ts Inter Results

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages