
Ts Eamcet Hall Tickets 2022
TS Eamcet Hall Tickets 2022: తెలంగాణ ఎంసెట్-2022 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై 11 వరకు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి
TS Eamcet Hall Tickets 2022: తెలంగాణ ఎంసెట్-2022 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై 11 వరకు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. కాగా ఎంసెట్ పరీక్షలను జులై 14వ తేదీ నుంచి20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ గ్రూప్ పరీక్షలు, జులై 18,19,20 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. కాగా ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ రూ.2700 ఆలస్యపు రుసుముతో జూలై 7 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మరి ఎంసెట్ హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి..
హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా..
*ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
*వెబ్‌సైట్ హోం పేజీలో ‘హాల్ టికెట్ డౌన్‌లోడ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
*అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్‌మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి.
*స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ డిస్‌ప్లే అవుతుంది.
*ఒకసారి హాల్ టికెట్‌పై మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి.
*హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసి పెట్టుకోండి.
* హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం చివరి నిమిషం వరకు వేచి చూడకండి. చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశముంది. కాబట్టి వీలైనంత వరకు వెంటనే హాల్‌టికెట్లు డౌన్‌లౌడ్ చేసుకోని భద్రపరచుకోండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
No comments:
Post a Comment