తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2022 ఫలితాలు ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జూన్ 1తో పదో తరగతి పరీక్షలు ముగియగా..
Telangana 10th Class Result Date: తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2022 ఫలితాలు ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జూన్ 1తో పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఆ రెండో రోజు అంటే జూన్ 2 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభమైంది. ఈ ఏడాది పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను జూన్ 30న ప్రకటించాలని విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లను మాత్రమే నిర్వహించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ పెంచారు. రెండేళ్ల తర్వాత ఈ జరిగిన పదోతరగతి పరీక్షలు జరగడంతో.. వీటి ఫలితాల విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
No comments:
Post a Comment