Telangana: యూనివర్సిటీ నియామకాలపై కీలక నిర్ణయం.. అధికారిక ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ సర్కారు.. | Telangana government orders on establishment of common recruitment board for university posts - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday 24 June 2022

Telangana: యూనివర్సిటీ నియామకాలపై కీలక నిర్ణయం.. అధికారిక ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ సర్కారు.. | Telangana government orders on establishment of common recruitment board for university posts

Telangana Education: తెలంగాణ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి మరో ముందడుగు పడింది. యూనివర్సిటీ నియామకాల కోసం కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం (TS Government) ఉత్తర్వులు జారీ చేసింది..

Telangana Education: తెలంగాణ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి మరో ముందడుగు పడింది. యూనివర్సిటీ నియామకాల కోసం కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం (TS Government) ఉత్తర్వులు జారీ చేసింది. కామన్ బోర్డు చైర్మన్‌గా ఉన్నత విద్యా మండలి చైర్మన్.. కళాశాల విద్య కమీషనర్ మెంబర్ కన్వీనర్‌గా, విద్యాశాఖ, ఆర్ధిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా నియమించింది. కాగా ఇప్పటిదాకా ఏ యూనివర్సిటీ పరిధిలోని ఖాళీలను ఆయా వర్సిటీలే భర్తీ చేసుకునే వీలుండేది. అయితే యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని ఏప్రిల్‌‌లో జరిగిన కేబినెట్‌‌ భేటీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే బోర్డు ఏర్పాటుకు సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్ (CM KCR) ఇటీవలే సంతకం చేశారు. ఇప్పుడు దానిని అమల్లోకి తీసుకొచ్చింది. కాగా కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా రాష్ట్రంలోని మెడికల్ యూనివర్సిటీ మినహా.. 15 వర్సిటీలలో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు.

కాగా ఇప్పటికే 3,500కు పైగా వర్సిటీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. వాటి భర్తీకి చర్యలు ప్రారంభించనుంది. అయితే కామన్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ఏర్పాటుతో ప్రస్తుతమున్న వర్సిటీల యాక్ట్‌‌లను మార్చాల్సి ఉంది. వర్సిటీ ఈసీల్లోనూ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ తర్వాతే రిక్రూట్‌‌మెంట్ బోర్డు ద్వారా పోస్టులను భర్తీ చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages