TS Inter Results: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు…

TS Inter Results
LIVE NEWS & UPDATES
-
28 Jun 2022 10:51 AM (IST)
గతేడాది అందరూ పాస్..
గతేడాది ఇంటర్ బోర్డ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఫెయిల్ కావడంతో ఫలితాలతో సంబంధం లేకుండా అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతేడాది తెలంగాణలో మొత్తం 4,51,585 విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించారు.
-
28 Jun 2022 10:48 AM (IST)
గ్రేడ్స్ ఎలా ఇస్తారంటే..
* 75 శాతం కంటే ఎక్కువ మార్కులు వస్తే A గ్రేడ్
* 60 నుంచి 75 శాతం మార్కులు వస్తే B గ్రేడ్
* 50 నుంచి 60 శాతం మార్కులు వస్తే C గ్రేడ్
* 35 నుంచి 50 శాతం మార్కులు వస్తే D గ్రేడ్ -
28 Jun 2022 10:21 AM (IST)
ఫలితాల కోసం ఎదురు చూస్తోన్న 9 లక్షల మంది..
మరికాసేపట్లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే పాస్ అవుతూ వచ్చిన స్టూడెంట్స్ తొలిసారి పబ్లిక్ పరీక్షల ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ కానున్నారు. ఇంటర్ ఫలితాల కోసం 9 లక్షల మంది విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
TS Inter 1st, 2nd Year Results 2022 Live Updates: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే పాస్ అవుతూ వచ్చిన స్టూడెంట్స్ తొలిసారి పబ్లిక్ ఎగ్జామ్ బేస్డ్ గా పైతరగతులకు ప్రమోట్ కానున్నారు. ఇంటర్ ఫలితాల కోసం 9 లక్షల మంది విద్యార్థులు ఆతృతుగా ఎదురుచూస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను మరికాసేపట్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంత్రి చేతులమీదుగా సరిగ్గా 11 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ తో పాటు టీవీ9 తెలుగు వెబ్ సైట్ tv9telugu.com లో కూడా విద్యార్థులు చూసుకోవచ్చు.
Published On – Jun 28,2022 10:17 AM
No comments:
Post a Comment