PGCIL Recruitment 2022: బీటెక్‌/బీఈ అర్హతతో పవర్‌ గ్రిడ్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.200000ల జీతం.. | Powergrid Recruitment 2022 for 32 Deputy Manager, Assistant Manager posts, details here - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday 27 June 2022

PGCIL Recruitment 2022: బీటెక్‌/బీఈ అర్హతతో పవర్‌ గ్రిడ్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.200000ల జీతం.. | Powergrid Recruitment 2022 for 32 Deputy Manager, Assistant Manager posts, details here

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Powergrid).. డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్ ( Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Powergrid Manager Recruitment 2022: భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Powergrid).. డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్ ( Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 32

పోస్టుల వివరాలు:

  • డిప్యూటీ మేనేజర్ పోస్టులు: 17
  • అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టులు: 15

వయోపరిమితి: జులై 20, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 36 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.60,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బీఈ/బీటెట్‌/బీఎస్సీ/ఎస్ఏపీ సర్టిఫికేట్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • ఓబీసీ, ఇతర అభ్యర్ధులు రూ. 500 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 19, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages