IIIT Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో టీచింగ్ ఉద్యోగాలు… ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. | IIIT Recruitment IIIT Nagpur recruitment teaching posts in computer science department - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 17 June 2022

IIIT Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో టీచింగ్ ఉద్యోగాలు… ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. | IIIT Recruitment IIIT Nagpur recruitment teaching posts in computer science department

IIIT Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాగ్‌పూర్‌లోని క్యాంపస్‌లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు…

IIIT Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాగ్‌పూర్‌లోని క్యాంపస్‌లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌, హ్యూమన్‌ కంప్యూటర్ ఇంటరాక్షన్‌ అండ్‌ గేమింగ్‌ టెక్నాలజీ అండ్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తులను ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల హార్డ్‌కాపీలను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), నాగ్‌పుర్‌, మహారాష్ట్ర 441108 అడ్రస్‌కు పంపించాలి.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 05-07-2022, హార్డ్‌కాపీల స్వీకరణకు 12-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* అభ్యర్థులను డెమో క్లాస్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages