Fact Check: ఇంగ్లిష్‌లో అదరగొట్టిన బెండపూడి విద్యార్థులు పదో పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారా? ఈ ప్రచారంలో నిజమెంత.. | Fact check on fake news circulating about bendapudi students fail in 10th exams - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 16 June 2022

Fact Check: ఇంగ్లిష్‌లో అదరగొట్టిన బెండపూడి విద్యార్థులు పదో పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారా? ఈ ప్రచారంలో నిజమెంత.. | Fact check on fake news circulating about bendapudi students fail in 10th exams

Fact Check: సోషల్‌ మీడియాతో (Social Media) ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్నే నష్టాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఉన్న వారు మరెక్కడో ఉన్న వారితో క్షణాల్లో సమాచారాన్ని పంచుకుంటున్నారు. అయితే…

Fact Check: సోషల్‌ మీడియాతో (Social Media) ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్నే నష్టాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఉన్న వారు మరెక్కడో ఉన్న వారితో క్షణాల్లో సమాచారాన్ని పంచుకుంటున్నారు. అయితే మార్పిడి జరుగుతోన్న ఈ సమాచారమంతా నిజమేనా అంటే కచ్చితంగా అవునని మాత్రం చెప్పలేం. ఎందుకంటే సోషల్‌ మీడియాను తమ వ్యక్తిగత అవసరాల కోసం తప్పుగా ఉపయోగించుకుంటున్న వారు కూడా ఉన్నారు. దీంతో జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ మళ్లీ అదే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటనలు చేసే రోజులు వచ్చాయి.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సైతం తప్పుడు ప్రచారాలకు చెక్‌ పెట్టేందుకు ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో ట్విట్టర్‌లో పలు పోస్టులను చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వైరల్‌ అవుతోన్న ఓ వార్తపై క్లారిటీ ఇచ్చింది. ఎంతకీ విషయమేంటంటే.. గతంలో ఏపీలోని బెండపూడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు అమెరికన్‌ స్లాంగ్‌ ఇంగ్లిష్‌తో అనర్గళంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి దృష్టితో పాటు సోషల్‌ మీడియా దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్‌తో అదరగొట్టిన విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొందరు విపక్ష నేతలు సైతం బహిరంగగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఈ ప్రచారం వెనకాల ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో భాగంగా బెడంపూడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని మాట్లాడిన వీడియోను, తన మార్కుల జాబితాను పోస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియాతో పాటు పలువురు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్‌. ఇలాంటి అసత్య ప్రచారాలు విద్యార్థులను నైతికంగా దెబ్బతిసేలా ఉన్నాయి అంటూ రాసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థులకు నెటిజన్లు మద్ధతు కొరుతూ ఓ వెబ్‌సైట్‌ లింక్‌ను కూడా పోస్ట్‌ చేశారు. అందులో తమ అభిప్రాయాలను పంచుకోమని సూచించారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages