Andhra Pradesh: విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎడ్యుకేషన్‌ టెక్‌ కంపెనీతో భారీ డీల్‌.. | Andhra pradesh government MOU with Byju’s for implementing tech education in govt schools - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 16 June 2022

Andhra Pradesh: విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎడ్యుకేషన్‌ టెక్‌ కంపెనీతో భారీ డీల్‌.. | Andhra pradesh government MOU with Byju’s for implementing tech education in govt schools

Andhra Pradesh: ఏపీ విద్యా వ్యవస్థలో భార్పీ మార్పులకు వైసీపీ (YSRCP) ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. ప్రపంచంతో పోటీపడే విధంగా, విద్యార్థులకు అధునాతన విద్యను అందించాలనే ఉద్దేశంతో…

Andhra Pradesh: ఏపీ విద్యా వ్యవస్థలో భార్పీ మార్పులకు వైసీపీ (YSRCP) ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. ప్రపంచంతో పోటీపడే విధంగా, విద్యార్థులకు అధునాతన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రముఖ ఎడ్యుకేషన్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి (Jagan Mohan Reddy) సమక్షంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ గురువారం సంతకాలు చేశారు. వర్చువల్‌ పద్ధతిలో ‘బైజూస్‌’ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ ఈ కార్యక్రమంలో అమెరికా నుంచి పాల్గొన్నారు.

దావోస్‌లో బీజం..

రాష్ట్రంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడంపై దృష్టిసారించిన సీఎం జగన్‌ ఇందులో భాగంగానే గత కొన్ని రోజుల క్రితం దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పలు యూనికార్న్‌ స్టార్టప్‌ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు, కీలక అధికారులతో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా నేర్చుకునేలా ఇ– లెర్నింగ్‌కార్యక్రమంపై నిశితంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రవీంద్రన్‌ చెప్పారు. ఈ చర్చల ఫలితంగా.. నేడు బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ విద్యను.. ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏడాదికి కనీసం రూ.20 వేల నుంచి రూ.24 వేలు చెల్లిస్తేకాని ‘బైజూస్‌’ ఇ– తరగతులు విద్యార్థులకు అందుబాలోకి రావు. అలాంటి నాణ్యమైన విద్య ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందనుంది.

సెప్టెంబరులో విద్యార్థులకు ట్యాబ్‌లు..

బైజూస్‌తో చేసుకున్న ఒప్పందం చేసుకోవడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పేదపిల్లల జీవితాలను మారుస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘మంచి చదువులను నేర్చుకునే విషయంలో పిల్లలను ముందుండి నడిపించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. పదోతరగతిలో ఆంగ్లమాధ్యమంలో సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది దోహదపడుతుంది. 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యారంగంలో ఇదొక గేమ్‌ ఛేంజర్‌. ప్రస్తుతం 8 తరగతి చదువుతున్న విద్యార్థులు.. తమ 10వ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ నమూనాలో రాయనున్నారు. వీరిని ముందుండి నడిపించడానికి ట్యాబ్‌లు కూడా ఇస్తాం. డిజిటల్‌ పద్ధతుల్లో నేర్చుకునే విధానం విద్యార్థులందరికీ అందుబాటులోకి వస్తాయి. ట్యాబ్‌లకోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నాము. ఈ సెప్టెంబరులోనే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తాము. వచ్చే ఏడాది నుంచి బైజూస్‌ కంటెంట్‌ను పొందుపరిచి పాఠ్యపుస్తకాలను ముద్రిస్తాము. నాడు – నేడు కింద ప్రతి తరగతి గదిలో టీవీలు ఏర్పాటు చేస్తామ’ని సీఎం తెలిపారు.

బైజూస్‌ భాగస్వామ్యం అమూల్యం..

విద్యా రంగంలో మార్పులు తీసుకురావాలనే ఏపీ ప్రభుత్వ సంకల్పానికి బైజూస్‌ నుంచి అందుతోన్న భాగస్వామ్యం అమూల్యమైందని సీఎం అభివర్ణించారు. ‘విద్యా రంగ వ్యవస్థలను మరింత మెరుగు పరచడానికి బైజూస్‌ సీఈఓ రవీంద్రన్‌ లాంటివారు ముందుకు రావడం శుభ పరిణామం. ఇందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రవీంద్రన్‌తో మరోసారి సమావేశమై ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంపై దృష్టిసారిస్తాం. స్విట్జర్లాండ్‌లో రవీంద్రన్‌తో జరిగిన సమావేశం అంశాలు నాకు గుర్తున్నాయి. సానుకూల దృక్పథంతో ముందుకు రావడం చాలా సంతోషకరం’ అని జగన్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండిమరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..No comments:

Post a Comment

Post Bottom Ad

Pages