AIIMS Jodhpur Recruitment 2022: ఎయిమ్స్‌ జోధ్‌పూర్‌లో 73 టీచింగ్‌ ఉద్యోగాలు..నెలకు రూ.లక్షన్నర జీతంతో.. | AIIMS Jodhpur Recruitment 2022 for 73 Professor, Additional Professor, Associate Professor posts - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 13 June 2022

AIIMS Jodhpur Recruitment 2022: ఎయిమ్స్‌ జోధ్‌పూర్‌లో 73 టీచింగ్‌ ఉద్యోగాలు..నెలకు రూ.లక్షన్నర జీతంతో.. | AIIMS Jodhpur Recruitment 2022 for 73 Professor, Additional Professor, Associate Professor posts

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందని జోధ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (AIIMS Jodhpur).. ప్రొఫెసర్‌ పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

AIIMS Jodhpur Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందని జోధ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (AIIMS Jodhpur).. ప్రొఫెసర్‌ పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 73

పోస్టుల వివరాలు:

  • ప్రొఫెసర్ పోస్టులు: 31
  • అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 8
  • అసొసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 21
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు: 13

విభాగాలు: అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పాథాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌ తదితర విభాగాలు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 58 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.1,23,100ల నుంచి రూ. 1,68,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌ లేదా తత్సమాన డిగ్రీలోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.3,000
  • ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూడీ/మ‌హిళ‌ల అభ్యర్ధులకు: రూ.200

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages